calender_icon.png 6 March, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

05-03-2025 01:16:23 AM

సూర్యాపేట, మార్చి 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సిబ్బంది కి  సూచించారు. మంగళవారం ఐలాపురంలోని  చివ్వేంల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కళాశాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాప్ హాజరు పట్టికని పరిశీలించి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.

పదవ తరగతి పరీక్షలో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరగతులు నిర్వహించాలన్నారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారిని ప్రోత్సహించి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచాలని కలెక్టర్ సూచించారు. 

నేటి నుంచి జరగబోయే వార్షిక పరీక్షలలో భయపడకుండా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మోతె మండలం మామిళ్ళగూడెంలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని ఆదేశించారు. మోడల్ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.