calender_icon.png 27 November, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి

06-11-2024 01:36:59 AM

 మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): కులగణన సర్వే నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయిం చాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం  సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘన అవుతుందని మండిపడ్డారు.

36,559 ఎస్జీటీలను, 3,414 మంది హెచ్‌ఎంలను సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఉదయం 9 నుంచి మ. 1 గంటల వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్య మా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకం రోజురోజుకు దిగజారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్కార్ నిర్ల క్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్వే పేరుతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభు త్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం పేద కుటుంబాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఒంటిపూట బడులు నడపడంతో పిల్లలకే కాకుం డా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయని,  పిల్లల చదువులు కుంటుపడటంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు.

 అశోక్‌నగర్‌ను శోక నగర్‌గా చేశారు

 రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వెళ్లి గ్రూప్స్ పరీక్షల విద్యార్థుల ఆవేదనను వినాలని హరీశ్‌రావు సూచించారు. మంగళ వారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ  ప్రస్తుతం అశోక్‌నగర్‌ను శోక నగర్‌గా మార్చిన రేవంత్ సర్కార్ తీరు చూడాలని కోరారు. ఎన్నికల ముందు  నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలో విద్యార్థులపై  సోకాల్డ్ ప్రజాపాలన కర్కశంగా వ్యవహరించిందని మం డిపడ్డారు.

లాఠీచార్జీ చేసిన దారుణాలు మీకు తెలుసా అని ప్రశ్నించారు. తాను వాగ్దానం చేసిన 2లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. టీఎస్పీపీఎస్సీని ప్రక్షాళన చేయకుండా టీజీపీఎస్సీగా పేరు మార్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన కపట ప్రేమ బట్ట బయలైందన్నారు. రేవంత్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తు పెట్టుకుంటుందని పేర్కొన్నారు.