- సర్వే కోసం ఉపాధ్యాయ సంఘాల సూచనలు తీసుకుంటాం
- సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సర్వేకు ఉపాధ్యాయుల సుముఖత
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): చారిత్రాత్మక కులగణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాము లను చేయాలని ప్రభుత్వం భావించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారి అభిప్రాయాలను భట్టి విక్రమార్క తెలుసుకున్నారు.
సర్వే ప్రాధాన్యత, ప్రభుత్వం ఆలోచనలను వారికి వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడు తూ.. ఎన్నికల హామీల అమలులో భాగంగా కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో టీచర్లను భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం నిర్ణయించి మీ ఆలోచనలను తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఉపాధ్యా య సంఘాలు కోరినట్లు ఉదయం వేళల్లో సర్వే నిర్వహించడం, సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు వరుస సెలవు ల మధ్య సర్వే చేపట్టడం, సెలవు రోజుల్లో సర్వే విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పరిహారంతో కూడిన సెలవులు మంజూరు చేయడం, సర్వేకు సంబంధించి సమా జంలో విస్తృత ప్రచారం చేయాలని ఇచ్చిన సూచనలన్నింటినీ ఆచరణలో పెడతామని తెలిపారు.
కాగా కుల గణన సర్వేను టీచర్లతో చేయించడాన్ని కొంతమంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో తాము చేపట్టిన సకల జనుల సర్వే ఎటు పోయిందో ఎవరికీ తెలియ దని, ప్రస్తుత ప్రభుత్వం కోరుకున్న విధంగా సర్వే చేయడానికి ఉపాధ్యాయ లోకం సిద్ధంగా ఉందని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌకతలీ తెలిపారు.
ఉపాధ్యాయులయితేనే సర్వే బాగా చేస్తారన్న తమపై నమ్మకం పెట్టుకున్నందుకు టీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు సీసీఎల్ పరిహారంతో కూడిన సెలవును మంజూరు చేయాలని యూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు.
సర్వేలో పాల్గొ ని ఉపాధ్యాయులకు సర్వేలో పాల్గొని ఉపాధ్యాయులకు స్పెషల్ సీఎల్‌తో పాటు, ఇన్సెంటివ్ ఇవ్వాలని డీటీఎఫ్ అధ్యక్షుడు లింగారెడ్డి కోరారు. ఎన్నికలు, జనగణన వంటి కీలక కార్యక్రమాలు ఉపాధ్యాయులు లేకుం డా పూర్తికావని, కులగణన సర్వేలోనూ సంపూర్ణంగా సహకరిస్తా మని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి తెలిపారు.
గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ సందర్భంలోనూ తమతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుం టుందని మోడల్ స్కూల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ య్య అభినందించారు. కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం సంతోషకరమని ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జాజుల వెంకటేశ్వరరావు తెలిపారు.
కాగా పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని టీచర్ సంఘాల నేతలు కోరారు. సమావేశంలోఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ వివిధ టీచర్ సంఘాల నేతలు దామోదర్ రెడ్డి, సదానందం గౌడ్, పర్వతిరెడ్డి, కటకం రమేశ్, అంజిరెడ్డి, కృష్ణుడు, అబ్దుల్లా, హన్మంత్‌రావు, నవాత్ సురేశ్, చంద్రప్రకాశ్, చెన్నయ్య పాల్గొన్నారు.