calender_icon.png 25 September, 2024 | 10:00 PM

కాంగ్రెస్‌తో టీచర్ల సమస్యలు తీరవు

09-09-2024 01:22:50 AM

  1. రోడ్లపైకి వచ్చి కొట్లాడితేనే తీరుతై.. 
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాల ం టీచర్ల సమస్యలు తీరవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురువం దనం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భం గా ఆయన మాటా ్లడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే లేదని, రోడ్డెక్కి యుద్ధం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే పోరాటాలకు తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.

టీచర్లు తలుచుకుంటే తలరాతలే మారతాయని, ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. గతంలో టీచర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సా ధించలేదని, విద్యార్థులు, ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు మొదలవుతుందన్నారు. బీఈడీ అర్హుతలుండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న టీచర్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయం కేంద్రంలోని హెచ్‌డీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఎన్‌సీటీఈ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయి ంచేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు కట్టా రాజేశ్వర్, హనుమంతరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.