calender_icon.png 19 January, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌ బిల్లులు, డీఎలను వెంటనే విడుదల చేయాలి..!

19-01-2025 08:31:28 PM

ఉద్యోగ విరమణ వయస్సు పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి..!

పిఆర్‌సి నివేదికను బహిరంగపరిచి, అమలు చేయాలి..!

సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి..!

విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి..!

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్‌

కామారెడ్డి,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సకినాల అనిల్ కుమార్(TPTF State President Sakinala Anil Kumar) డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్‌, గన్‌ఫౌండ్రి టిపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి విద్యారంగ, ఉపాధ్యాయరంగ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టినారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు ఎం.ప్రకాష్‌ రావు, ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్‌ రెడ్డి, పి.నారాయణమ్మ, డి. శ్రీనివాస్‌, ఎం.లక్ష్మయ్య యాదవ్‌, బి.రాజు రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.విజయ్‌, బోగ రమేష్‌, దామెర రాజయ్య, సిద్దోజు కవితలు పాల్గొన్నారు. టిపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసినప్పటికీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నదని, సంఘాలతో కనీసం చర్చించడం లేదని తెలిపారు.

ఉపాధ్యాయుల తమ ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న జిపిఎఫ్‌ లోన్లు, జీఐఎస్‌ లోన్లు, సరెండర్‌లీవు, సప్లమెంటరీ బిల్లులు సంవత్సరానికి పైగా విడుదల చేయకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే పెండిరగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులను, డి.ఎ.లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ పిఆర్‌సి కమిటీని నియమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిఆర్‌సి ఫిట్‌మెంట్‌కు సంబంధించి సిఫార్సులను తీసుకున్నప్పటికీ పిఆర్‌సి నివేదికను ఇప్పటి వరకు బహిరంగపర్చలేదు అన్నారు. ప్రభుత్వం పిఆర్‌సి నివేదికను బహిరంగ పరిచి, వెంటనే అమలు చేయాలని కోరారు. టిపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును రెండు లేదా మూడు సంవత్సరాలకు పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు పెంచే ఆలోచలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. తుక్కుగూడ ప్రధానోపాధ్యాయులపై జరిగిన దాడిని నిరసిస్తూ రేపు జరిగే నల్లబ్యాడ్జీల కార్యక్రమమును విజయవంతం చేయాలని కోరారు.