13-04-2025 05:37:02 PM
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి,(విజయక్రాంతి): టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కామ్రేడ్ కే రమణ అన్న అనారోగ్యంతో ఆదివారం మరణించడం చాలా బాధాకరం అని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ రమణ నిరంతరం ఒకవైపు శ్రమిస్తూనే, సమసమాజ స్థాపన కోసం, శ్రామిక వర్గాల అభివృద్ధి కోసం నిరంతరంఉద్యమ మార్గంలో పయనించిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని అన్నారు. రమణ అన్నకు టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ నివాళులర్పిస్తున్నదని పేర్కొన్నారు. ఐక్యఉపాధ్యాయ నిర్మాణానికి ఆయన కృషి ఆదర్శనీయ మనీ పేర్కొన్నారు.
ఉపాధ్యాయునిగా రమణ అన్న మొదటి నుండి ఫెడరేషన్లో కార్యకర్తగా నాయకునిగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన నిలబడి పోరాడిన నాయకుడిని ఫెడరేషన్ కోల్పోవడం తీరని లోటు అని అన్నారు. రమణ అన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రమణ అన్న అకాల మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నలు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ తెలిపారు. ఆయన మరణం ఫెడరేషన్కు ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. ఆయన అంత్యక్రియలు కామారెడ్డిలో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. రమణకు భార్య ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తె ఉన్నారు.