calender_icon.png 28 February, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూర్గంపాడులో ప్రశాంతంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

27-02-2025 10:13:37 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో గురువారం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటల నుండి ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 57 మంది గాను 54 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయుల పోలింగ్ 94.73 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి  పర్యవేక్షించారు.పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బూర్గంపాడు ఎస్సై నాగ బిక్షం బందోబస్తు నిర్వహించారు.