09-03-2025 07:21:30 PM
ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే గురుతర బాధ్యత ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. ఆదివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో అవార్డు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులందరూ ఒకచోట చేరి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషమని సమాజాన్ని మంచిదారిలో నడిపే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అవార్డు టీచర్స్ అసోసియేషన్ వారు పది ప్రాథమిక పాఠశాలల కు 20 చొప్పున చిన్నపిల్లల కుర్చీలు 200 అందజేశారు. 2024 సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ దంపతులను అవార్డు టీచర్స్ అసోసియేషన్ తరపున సన్మానం తో అసోసియేషన్ లోకి ఆహ్వానించారు. కామారెడ్డి ఆట గేయాన్ని ఆవిష్కరించారు. కామారెడ్డి ఆట డైరీ ని ఆవిష్కరించి హాజరైన సభ్యులందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎనిమిది మంది మహిళలను సన్మానించారు. కవి తగిలించి నరసింహారెడ్డి రచించిన ఆట కామారెడ్డి గేయాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఆట కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డి మనోహర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి, కోశాధికారి హరిప్రసాద్, సహాధ్యక్షులు విష్ణువర్ధన్, వ్యాఖ్యాన సామ్రాట్ ఆంబీర్ మనోహర్, విజయకుమారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేనాధిపతి, గంగాకిషన్, జిల్లా ఆట కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.