మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి గురువులందరినీ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సూది రెడ్డి, తెలుగు అధ్యాపకులు శ్రీధర హరీష్ కుమార్, అధ్యాపక బృందం డాక్టర్ టి గంగయ్య, ఎం. కుమార స్వామి, రావి కంటి గోపాలకృష్ణ, డాక్టర్ కే రాజయ్య, జాడి. మహేష్ కుమార్, ఏం కనకలక్ష్మి, వీ కరుణాకర్, మోరే రాజు, ఎం మధుసూదన్, వి అరుణ, బిట్ల నవీన్, విద్యార్థి బృందం పాల్గొన్నారు.