09-03-2025 12:16:28 AM
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షల వి ధులు నిర్వర్తిస్తున్న అధికారులకు చిక్కొచ్చి పడింది. పరీక్షా కేంద్రా ల్లో డ్యూటీ పడ్డ సిబ్బందిగోడ గడియారాల కోసం షాపుల చు ట్టూ తిరుగుతున్నా రు. ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు షురువయ్యాయి. అయితే విద్యార్థులు వాచులు వాడొద్దని ఇంటర్ బో ర్డు ఆదేశాలిచ్చింది. దీంతో పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు లేక, ప్రతీ అర్ధగంటకు ఒకసారి చొప్పున బెల్ కొట్టకపోవడంతో సమయం తెలియక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.
దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పరీక్ష కేంద్రాల్లోని ప్రతీ గదిలో గడియారం పెట్టాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చే సింది. గోడ గడియారాల కోసం శనివారం మార్కెట్లలో షాపుల చుట్టూ తిరిగారు. అయితే గోడ గడియారం ఒకటి రూ. 100 చొప్పున కొనుగోలు చేయాలని అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఈనెల 10న ఇంటర్ సెకండియర్ వారికి పరీక్ష ఉంది.
ఆలోగా గడియారాలను ఏర్పా టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు పరీక్షల నిర్వహణ సిబ్బ ంది తెలిపారు. కేంద్రంలో ఎన్ని గదులుంటే అన్ని వాచులు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు.