calender_icon.png 12 January, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్లలో కీచక టీచర్

22-10-2024 02:04:26 AM

విద్యార్థినులతో అసభ్యకర ప్రవర్తన

నిందితుడిపై పోక్సో కేసు

సిరిసిల్ల, అక్టోబర్ 21 (విజయక్రాంతి):  విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. సిరిసిల్ల గీతానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నరేందర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యా ర్థినులు హెచ్‌ఎం శారద దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఎలాంటి చర్యలు తీసుకోకుండా విష యం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. ౨౦ రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటకు పొక్కడంతో తప్పనిపరిస్థితిలో హెచ్‌ఎం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.