calender_icon.png 26 November, 2024 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో ఉపాధ్యాయులే కీలకం

11-11-2024 01:41:37 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ నగేశ్, పక్కన ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ ఎంపీ నగేశ్

ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, విద్యార్థి భవిష్యత్తు, జాతి నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేర్కొ న్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) 6వ రాష్ర్ట విద్య మహాసభలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తానని ఎమ్మెల్యే అన్నారు. బదిలీలు పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను ప్రభుతం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లల ఉజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదరులు తుమ్మ లచ్చిరాం, రఘునందన్‌రెడ్డి, నాయకులు బేర దేవన్న పాల్గొన్నారు.