రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): సమాజానికి మార్గదర్శకు లు ఉపాధ్యాయులని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బషీర్‌బాగ్ భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించా లన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే క్రతువులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 99 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. వేడుకలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఈవో ఆర్.రోహిణి, కార్పొరేటర్ సురేఖ, ఆర్‌డీవో మహిపాల్ పాల్గొన్నారు.