జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : సమాజ నిర్మాణంలో ఉపాధ్యా యుల పాత్ర ఎంతో కీలకమైందని ఉపాధ్యాయులు బాధ్యతా యుతంగా వ్యవహరించి విద్యార్థులను ఉన్నతం గా తీర్చిదిద్దాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తపస్, పిఆర్టియు, టిఆర్టిఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు, పద్మనాయక వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాద్యాయుల పాత్ర చాలా కీలకం అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగుల ప్రమోషన్ లు, బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రముఖ న్యాయవాది స్వర్గీయ మాకునూరి హనుమంతరావు జ్ఞాపకార్థం వెలమ సంక్షేమ సంఘం వృద్ధాశ్రమానికి రూ.5లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ బాధ్యులు నరేందర్ రావు, రాజశేఖర్, దేవయ్య, ప్రసాదరావు, పిఆర్టియు బాధ్యులు ఆనందరావు, అమర్నాథ్‌రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.