calender_icon.png 27 December, 2024 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సర్దుబాటును రద్దు చేయాలి

26-12-2024 08:01:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం సరికాదని ఎస్టీయు జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్ పేర్కొన్నారు. గురువారం భూమన్న మాట్లాడుతూ... సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింప చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను కేజీబీవీ పాఠశాలకు పంపడం వల్ల ఉన్నత పాఠశాలలో కూడా ఇబ్బందులు ఎదుర కానునయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం  ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకొని సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు