19-04-2025 11:54:09 PM
వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ తన బాధ్యతను మరిచాడు. విద్యార్థులకు దగ్గరుండి మందు పోసి వారు తాగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో సదరు ఉపాధ్యయుడిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలో జరిగింది. బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్‌సింగ్ టీచర్ పనిచేస్తున్నాడు. శుక్రవారం అతడు కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. ఈ వీడియో జిల్లా కలెక్టర్ దిలీప్‌కుమార్ యాదవ్‌కు చేరడంతో ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. అనంతరం ప్రతాప్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు.