calender_icon.png 4 April, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాభర్తలపై దాడి చేసిన ఉపాధ్యాయుడు

02-04-2025 12:00:00 AM

పాల్వంచ రూరల్ స్టేషన్‌లో కేసు నమోదు 

పాల్వంచ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): భార్యాభర్తలపై దాడి చేసిన నంఘటనలో ఒక ఉపాధ్యాయుడు పై కేసు నమోదైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సంబంధించిన వివరాలు బి సురేష్ స్ ఐ తెలిపిన వివరాల ప్రకారం , మండల పరిధిలోని ఇల్లందులపాడు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీలత,గుగులోత్ కిషన్ అనే భార్యాభర్తల పై అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిషోర్ పాత కక్షల నేపథంలో భార్య భర్తలపై కక్ష సాధింపులు చర్యలు చేపట్టాడని.

ఆ ఉద్దేశంతో గత నెల 31 నా వారిని హతమార్చేందుకు పన్నాగం పన్నాడు, ఈ క్రమంలో తను అనుకున్నదే తనవుగా భార్యాభర్తలను కిషన్ ఇంటి ఆవరణంలోకెళ్ళి వారి ఇరువురితో ఘర్షణ దిగాడు,ఈ ఘటనలో శ్రీలత,కిషన్ బలమైన గాయాలు అయ్యాయి. భార్యాభర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు కిషోర్ పై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.