* గమనించి నవ్విన విద్యార్థిపై దాడి
* తండ్రి ఫిర్యాదుతో పోలీసుల అదుపులోకి..
ఝాన్సీ, డిసెంబర్ 29: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉ పాధ్యాయుడే తరగతి గదిలో తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ కూర్చున్నాడు. అది చూసి నవ్విన ఓ విద్యార్థిని చితకబాదాడు. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం టీచర్ కుల్దీప్ యాదవ్ తరగతి గదిలో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు.
గమనించిన ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో అంతా కలిసి నవ్వారు. అవ మానంగా భావించిన టీచర్ అతన్ని చితకబాదాడు. ఘటనపై విచారించేందుకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. తాను చేసిన పనికి విద్యార్థుల ముందు ప రువు పోయిందని భావించిన సద రు ఉపాధ్యాయుడు తన కొడుకును కొట్టగా, గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసు లకు ఫిర్యాదు చేశానన్నారు.