calender_icon.png 23 February, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్

22-02-2025 01:31:00 AM

వనపర్తి, ఫిబ్రవరి 21 ( విజయక్రాంతి ) :  జిల్లాలోని పలు అభివృద్ధి, పాలనపై కలెక్టర్ నిత్యం బిజీగా ఉండడం చూస్తుంటాం. అంత బిజీ షెడ్యూల్ లో కూడా వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు కాసేపు గణితంను బోదించారు.  జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం మాత్రమే అందించాలని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా గణితం పై కొన్ని ప్రశ్నలు సందించి, సమాదానాలు రాబట్టారు సరైన విదంగా గణిత సమస్యలను పరిష్కరించిన విద్యార్థులకు చాక్లెట్లు అందజేశారు 

భవిత కేంద్రం సందర్శన

భవిత కేంద్రం లోని బాల బాలికలకు ఫిజియోథెరపీ,  స్పీ తెరపి వంటి వాటిలో చక్కని శిక్షణ అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.  జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు.  ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్ కి పంపడానికి అన్ని రకాలుగా అవసరమైన విధంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యాశాఖ అధికారులు యుగేందర్ శేఖర్, బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఉమాదేవి, భవిత కేంద్రం సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.