calender_icon.png 4 February, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయును సర్దుబాటు చేయాలి

03-02-2025 10:44:43 PM

అధికారుల చర్యలు డ్రాప్ అవుట్లను పెంచే విధంగా ఉన్నాయి..

SGTU డిమాండ్..

నిజామాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ మండలాల్లోనీ ప్రాథమిక పాఠశాలల్లో గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల సంఖ్య ఇప్పటికప్పుడు పెంచుతున్నప్పటికీ విద్యార్థులకు తగిన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో ఎక్కడైతే ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారో అక్కడి నుండి అవసరమయ్యే పాఠశాలలకు వారిని సర్దుబాటు చేయాలనీ విద్యాశాఖ అధికారి చెప్పిన మండలాల్లోని విద్యాధికారులు ప్రాథమిక పాఠశాలలకు కాకుండా ఉన్నత పాఠశాలలకు అవసరం లేకున్నా సర్దుబాటు చేస్తున్నారని ఎస్జి టియు తెలిపింది. ధర్పల్లి మండలంలో దుబ్బాక ప్రాథమిక పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచిన కూడా ఇప్పటికి ఆ పాఠశాలలో 156 మంది విద్యార్థులకు (LKG, యూకేజీ కాకుండా) ముగ్గురే ఉపాధ్యాయులు ఉన్నారని అదే గ్రామంలో OC కాలనీలో ఒక SGT ని ఈ పాఠశాలకు ఇచ్చే అవకాశం ఉన్న ఆ SGTని జిల్లా పరిషత్ చల్లగరగ  స్కూలుకు SA బయో సైన్ స్థానంలో ఇచ్చారని ఎస్ జి టి యు నాయకులు తెలిపారు. 

నిజానికి జిల్లా పరిషత్ దుబ్బాక స్కూల్లో  130 విద్యార్థులు ఉండగా అందులో కేవలం ఒకే సెక్షన్  నడుస్తోందని, అక్కడ రెండు సెక్షన్ లకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని,. దాని వల్ల అక్కడ SA తెలుగు, SA బయో సైన్స్ SA మాథ్స్, SA ఫిజిక్స్  POST లు అదనంగా ఉన్నాయి  ఆ పోస్టుల వారిని అవసరమగు చోటికి సర్దుబాటు చేసే అవకాశం ఉన్న మండల విద్యాధికారి వారిని సర్దుబాటు చేయకుండా SGT లను సర్దుబాటు చేస్తూ ప్రాథమిక పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య తగ్గేట్టుగా వ్యవహరిస్తున్నారని డ్రాపోర్ట్లు తగ్గించాల్సింది పోయి పెంచేలా సదర్ అధికారి చర్యలు ఉన్నాయని ఎస్జీటీయూ ఆరోపించింది. 

ఇదే మండలంలో ప్రాథమిక పాఠశాల సీతల్ పేట్ యందు 120 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల చల్లగరగ లో 86 మందికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలలకు ఎస్జిటిలను సర్దుబాటు చేయాల్సి ఉండగా అవసరం లేని పాఠశాలలకు ఎస్జిటీలను  సర్దుబాటు చేస్తున్నారు. అలాగే జక్రాన్ పల్లి, నవీపేట్ వంటి మండలంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇట్టి పరిస్థితులను జిల్లా విద్యాశాఖ అధికారికి  శనివారం రోజు SGTU తరపున వినతి పత్రాన్ని ఇచ్చి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరారు. ఎస్జిటియు నాయకుల విజ్ఞాపనకు స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులను అవసరమయ్యే చోటుకి నియమించే విధంగా సర్దుబాటు చేస్తామని డిఇఓ తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన వారిలో SGTU జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి గంగప్రసాద్, కోశాధికారి మోహన్, ధర్పల్లి మండల అధ్యక్షులు గంగాధర్ తదితరులు ఉన్నారు.