కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యార్థులకు మంచి విద్యాబోధన చెప్పాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూడాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన గురువులే అడ్డదారులు తొక్కడంతో సమాజంలో గురువు అనే పదానికి చెడ్డ పేరు తీస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఉపాధ్యాయులపై ఫోక్సు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులపై చేసి పోలీసులు కటకటాల పాలు చేసిన విషయం మరవక ముందే బాన్సువాడ మండలంలోని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ ఉపాధ్యాయుని తోపాటు మధ్యవర్తిత్వం వహించినా ఓ సర్పంచ్ పై పోక్సో చట్టం(Pocso Act) కింద కేసు నమోదు కావడంతో కటకటాల పాలైన విషయం విధితమే.
శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థినిలపట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై నిజాంసాగర్ పోలీసులు ఫోక్ సోకేస్ నమోదుచేసి అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ను వివరణ కోరగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
నలుగురు నవోదయ పాఠశాల ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదైన విషయంపై వివరణ కోరగా ధ్రువీకరించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతూ సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. సమాజంలో కీచకులుగా మారుతున్న ఉపాధ్యాయుల పై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ పాఠశాల లోని నలుగురు ఉపాధ్యాయులపై నమోదు కావడం ఉపాధ్యాయ వర్గాలలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపు తుంది.