26-02-2025 10:21:59 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని వేధిస్తూ, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్గుల్ గ్రామంలోని సెయింట్ మ్యాథ్యూస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న మనీష్ (20), తరచు ఆమెను వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని, దీంతో విసుగు చెందిన విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. కాగా బుధవారం న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు.