calender_icon.png 5 October, 2024 | 6:41 PM

ఎస్సీ వర్గీకరణ చేశాకనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

05-10-2024 04:50:49 PM

ఎంఎస్ పి జిల్లా అధ్యక్షుడు పెర్క పర్శ రాములు 

సిద్దిపేట (విజయక్రాంతి): సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మక ద్రోహం చేయడమే అవుతుందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు పెర్క పర్షా రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ ప్రకాష్ మాదిగ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ మాదిగల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు.

త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటే, ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమని మండి పడ్డారు. ఎస్సీ వర్గకరణ జరిగకనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9 న జిల్లా కేంద్రం లో ఉన్న అంబేద్కర్ విగ్రహం  వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో భారీ ప్రదర్శన చేపడుతున్నాట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కాపల్లి రాజు, ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి సుంచు రమేష్, మరాటి సంతోష్, బింగి పవన్ కళ్యాణ్, శ్రీహరి సింధు, సుందరగిరి భాస్కర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.