27-02-2025 07:31:55 PM
చిట్యాల: మండల కేంద్రంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని చిట్యాల తహశీల్దార్ నల్లబెల్లి హేమ(Chityala Tahsildar Nallabelli Hema) తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 63లో 44 మంది ఉపాధ్యాయులకు గాను 41 మంది ఉపాధ్యా యులు తమ ఓటు హక్కును వినియోగించినట్లు ఆమె వెల్లడించారు. పోలింగ్ సరళిని భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్, ఆర్డిఓ రవి డిఎస్పీ సంపత్ కుమార్ పరిశీలిం చారు.. పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలింగ్ బూత్ కు సీజ్ చేసి వాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ల రాజు, పంచాయతి కార్యదర్శి రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.