04-03-2025 07:03:42 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి రౌండ్ లోనే గెలుపొందడం చరిత్ర సృష్టించింది అని తపస్ ప్రతినిధులు అన్నారు. కొమురయ్య గెలుపుతో మంగళవారం మద్నూర్ లో విజయోత్సవాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్సీ గెలుపునకు కష్టపడ్డ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నాంపల్లి మల్లేశం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్యాదరి రాజేందర్, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్, జిల్లా కార్యదర్శి గోజే సంజయ్ కుమార్, తపస్ మద్నూర్ అధ్యక్షులు కొండావార్ పండరినాథ్, ప్రధాన కార్యదర్శి పవార్ అజిత్ కుమార్, పవార్ సంజయ్, ఉపాధ్యాయులు గడ్డివార్ నాగనాథ్, యం అశోక్, రాచప్ప, కమలాకర్, సంజయ్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.