calender_icon.png 28 February, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

27-02-2025 09:39:36 PM

చర్లలో 92.15% పోలింగ్ నమోదు 

కట్టుదిట్టమైన పోలీస్ పహారా నడుమ పోలింగ్

చర్ల,(విజయక్రాంతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  ఎన్నికలు చర్ల మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 87 లో జరిగిన మొత్తం పోలింగ్ 51 ఓట్లకు గాను 47 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలియజేశారు. పురుషులు 19 మంది మహిళలు 28 మంది తో ఓటింగ్ జరిగిందని ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళల ఓటింగ్  మాత్రమే పోలవ్వలేదని చెప్పుకొచ్చారు, 92.15% ఓటింగ్ శాతం పోలైనట్లు  తెలియజేశారు , పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీస్ పహార నడుమ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చినట్లయితే  ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ శాతం చర్ల మండలంలో పెరిగిందని చెప్పవచ్చు . పోలింగ్ బూత్ అధికారుల సమక్షంలో తాసిల్దార్ శ్రీనివాస్, సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సజావు నడిపించారు.