calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపుల టీచర్‌పై వేటు!

18-04-2025 12:09:28 AM

- విజయక్రాంతి వరుస కథనాలతో స్పందించిన రాష్ట్ర ఉన్నతాధికారులు  

-  మొదట పెంట్లవెల్లికి బదిలీ గంటల వ్యవధిలోనే విధుల నుంచి తొలగింపు

-  ఇంకా స్పందించని పోలీసు అధికారులు

 నాగర్ కర్నూల్ ఏప్రిల్ 17 విజయక్రాంతి: కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యనందించాల్సిన సదరు టీచర్ చిన్నచిన్న కారణాలతో వారిని టార్చర్ చేయడంతో పాటు స్నానపు గదుల్లో వీడియోలు ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడిన టీచర్ పై ఎట్టకేలకు వేటు పడింది. గత మూడు రోజులుగా విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురించడంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

నాగనోలు కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న టార్చర్ టీచర్ గా పేరొందిన ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని కాపాడేందుకు మొదట పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలకు బదిలీ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా బుధవారం ఉదయం విధుల్లో చేరారు. కానీ తనపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసిన విషయాన్ని విజయక్రాంతి బయట పెట్టడంతో రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు చివాట్లు పెట్టినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో గురువారం టర్మినేట్ విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ రమేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ పోలీసు అధికారులు మాత్రం కేసు నమోదు చేసినప్పటికీ గత పది రోజులుగా విచారించకుండా మీనమేషాలు లెక్కించడం రాజకీయ నేతల వత్తిల్లా లేఖ ఇతర అమ్యామ్యాల కారణాలా తెలియాల్సి ఉంది.

సాధారణ పౌరుడిపై గిట్టనివారు ఫిర్యాదు చేసినా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్ళే ఈ పరిస్థితుల్లో చదువుకునే విద్యార్థులను స్నానపు గదుల్లో ఫోటోలు వీడియోలు తీసి ఇతరులకు పంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు టీచర్ విషయంలో అలసత్వం వెనక ఆంతర్యం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సెక్షన్లతో కంటి తూర్పు కేసులు నమోదు చేస్తూ ఉన్నత వర్గానికి చెందిన వారిని కాపాడేందుకే చట్టం చుట్టంగా మారుతోందని పలువురు మండిపడుతున్నారు.