నాగర్‌కర్నూల్, జనవరి 21 (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో మహిళా టీచర్ మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హైద చెందిన బాలరాణి(20) నాగర్‌కర్నూల్‌లోని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నది. మార్కెట్‌యార్డు ప్రాంతంలో మరో టీచర్‌తో కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం రాత్రి అద్దెకు ఉంటున్న ఇం ఉరేసుకని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యపై స్థానికులు ఆనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.