06-02-2025 07:57:30 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కాలేజీ రోడ్ గ్రౌండ్ లో రాంనగర్ ఏరియాకి చెందిన బండం బాపు(52) గురువారం ఉదయం షటిల్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు మంచిర్యాల పట్టణ ఎస్ఐ ముత్తే ప్రవీణ్ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నూరుకు చెందిన సతీష్ వద్ద రూ. 20 లక్షలు అప్పుగా తీసుకోగా ఆ విషయంలో ఏర్పడిన ఆర్థిక వ్యవహారాల్లో బాపుని పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదన గురయ్యే వారని, ఈ విషయమే పదేపదే తలుచుకుంటూ ప్రతిభ కాలేజీ గ్రౌండ్ లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడని, అక్కడున్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ మృతి చెందారు. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాపు భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.