calender_icon.png 21 January, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

20-01-2025 10:46:30 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ రమేష్ గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం పాఠశాలలో విధులకు హాజరైన ఆయన ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలాడని సిబ్బంది తెలిపారు. తోటి ఉపాధ్యాయులు ఆయనను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.