14-02-2025 01:59:12 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు జాగ్రత్తగా విద్య బుద్ధులను నేర్పించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్ నగర్ పట్టణం పాల్కొండ లో పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, భూత్పూర్ లోని పిహెచ్సి లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రానికి వచ్చే గర్భిణీ, బాలింత, చిన్నారులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు సవిధానంగా సమాధానాలు చెబుతూ అవసరమైన వైద్య సదుపాయాలను అందించాలని చెప్పారు. మీరు విధులు నిర్వహించే ప్రాంతంలో మీ బాధ్యతలను మరింత సక్రమంగా నిర్వహించేందుకు అందరిని మీ తోటి వారిగా భావించి సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నేడు రేపు నిర్వహిస్తున్న నగరోత్సవ వేడుకలకు సంబంధించి పక్క ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, సీఎంఓ బాలు యాదవ్, భుత్పూర్ పి.హె.సి.మెడికల్ ఆఫీసర్ డా. అబ్దుల్ రబ్ ,ప్రభుత్వ యునానీ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.ఎం.డి. జహీరుద్దీన్ తదితరులు ఉన్నారు.