calender_icon.png 26 April, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసంత్ నగర్‌లో టీ స్టాల్ ప్రారంభం

26-04-2025 12:21:22 AM

పాలకుర్తి, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): యువత స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.  పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ టోల్గేట్ ప్లాజా వద్ద దాసరి సాగర్, బోగోజు అశోక్ లు నూతనంగా ఏర్పాటు చేసిన ఇరాని డ్యూడ్ టీ స్టాల్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా శ్రీని బాబు మాట్లాడుతూ యువత ఉద్యోగాలు రావడం లేదని అధైర్య పడ కుండా స్వయంకృషితో సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. టీ స్టాల్ ను ఏర్పాటుచేసిన యువకులను శ్రీనుబాబు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర  సామ్మయ్య, పాల్గొన్నారు.