calender_icon.png 26 January, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీఎస్ రద్దు పిటిషన్ తిరస్కరణ

25-01-2025 01:46:43 AM

న్యూఢిల్లీ, జనవరి 24: ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) విధానాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ అశ్వినీ ఉపాధ్యా య్ అనే అడ్వొకేట్ తరఫున మరో అడ్వొకేట్ అశ్వినీ దూబే సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

టీడీఎస్ కారణంగా పౌరులు సమానత్వపు హక్కుతో పాటు ఇతర ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని, అందుకే ఆ విధానాన్ని రద్దు చేయా లని పిటిషనర్ కోరారు. పిల్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిల్ లోపభూయిష్ఠంగా ఉందని, పిల్‌ను విచారణకు స్వీకరించలేని పేర్కొన్నది. టీడీఎస్ విధానం అన్ని దేశాల్లోనూ అమలవుతున్నదని, పిటిషనర్ కావాలంటే ఢిల్లీ హైకో ర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.