01-04-2025 02:30:46 AM
వారసిగూడ, విజయక్రాంతి, మార్చి 31 : టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవ సమావేశం సోమవారం ఉదయం సికింద్రాబాద్ టీడీపీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ లోని ఆయన నివాసంలో జరిగింది. ఈసందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు.
టీడీపీ ప్రజల కొరకు, ప్రగతి కొరకు తెలుగు గడ్డ అభివృద్ధి కొరకు పుట్టిన పార్టీ అని, అలాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు తనయులు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిధిగా రావడం సికింద్రాబాద్ నియోజకవర్గం అదృష్టం అన్నారు.
టీడీపీకి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, జీవీ.కృష్ణ, వెంకటస్వామి, శేషిరేఖ, మురళీకృష్ణ, చంద్రమోహన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.