calender_icon.png 21 April, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్ టీడీపీ సీనియర్ నాయకుడు సీహెచ్.కర్ణా మృతి

19-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): టీడీపీ సీనియర్ నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సన్నిహితుడు సిహెచ్ కర్ణా (75) శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెం దారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె  ఉన్నారు. రైల్వే ఉద్యోగి అయిన సీహెచ్ కర్ణా టీడీపీలో చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ పై ఉన్న అభిమానంతో బీఆర్‌ఎస్ లో చేరినప్పటికి పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరం గా ఉండేవారు.

ఆయన మృ తిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎం ఎన్ శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ గంగపుత్ర సంఘం నాయకులు, వివిద పార్టీ ల నేతలు ఆయన భౌతికకాయా న్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కు టుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు.  అంత్య క్రియ లు పార్శిగుట్టలోని గంగపుత్ర సంఘం శ్మశానవాటికలో నిర్వహించారు.