calender_icon.png 12 March, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెదేపా విన్నపం

11-03-2025 04:32:53 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బృందం మున్సిపల్ కమిషనర్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ.. వేసవికాలం మొదలై మార్చిలో నెలలోనే అత్యధిక ఎండలు ఉండటంతో నిత్యం ఇల్లందు పట్టణంలో ఏదో పని కోసం ఆఫీసులకు వచ్చే ప్రజలకు, ఇతర పనులపై బయటకు వచ్చే ప్రజలకు మున్సిపాలిటీ ఆఫీసు ప్రాంగణంలో అదే విధంగా ఇల్లందు పట్టణంలోని ప్రధాన కూడల్ల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీని ద్వారా ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం ఉంటుందని భావిస్తున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, టిడిపి సీనియర్ నాయకులు శ్యామ్ తీవారి, మైఫా బాలరాజు, చిలుమల బాబు, దేశవత్ శ్రీహరి, కంది రవి, శ్యామ్ సుందర్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు  మట్టెల రత్నాకర్, గుగులోతు రాందాస్, దేవరకొండ నవీన్, వాసం వినీత్ తదితరులు పాల్గొన్నారు.