calender_icon.png 26 December, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో టీడీపీ సభ్యత్వ నమోదు

07-11-2024 02:54:58 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్టియుసి కార్యాలయంలో గురువారం టిఎన్టియుసి నాయకులు టీ.మణి రామ్ సింగ్, ఎన్.ఏడుకొండలు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మని రామ్ సింగ్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీ రామారావు టిడిపి పార్టీని స్థాపించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పరుగు పందెం ద్వారా 35 వేల నుండి 40 వేల వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన రూ.100 సభ్యత్వ నమోదు చేసుకుంటే వారికి 5 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 వేల మట్టి ఖర్చులకు, విద్య వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టిడిపి, టిఎన్టియుసి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.