22-02-2025 06:44:31 PM
మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి టీడీపీ నాయకుల హెచ్చరిక
జనగామ,(విజయక్రాంతి): టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)పై అర్ధరహిత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ రామిని హరీశ్(Jangaon Constituency In-charge Ramini Harish) హెచ్చరించారు. శనివారం జనగామలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం(BRS Plenary Meeting)లో టీడీపీ, చంద్రబాబు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టకున్నది, హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేసిన విషయాలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఏపీ, మహారాష్ట్రలో బీఆర్ఎస్ సొంత ప్రయోజనాలకు వాడుకుందని, అందుకే ఇక్కడి ప్రజలను ఆ పార్టీని తన్ని తరిమేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేరిపోతుల కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి ఎల్లేష్ , ఎండీ.ఇక్బాల్, దేవునూరి సంపత్, గుగులోత్ కనకరాజు, ఎండీ.యాకూబ్ పాషా, తేజావత్ అజయ్ పాల్గొన్నారు.