calender_icon.png 1 April, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో టిడిపి నాయకుల బైక్ ర్యాలీ

29-03-2025 05:32:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం టిడిపి పట్టణ అధ్యక్షుడు టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి టి. మని రామ్ సింగ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాజీ సీఎం, దివంగత నందమూరి తారక రామారావు హాయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడని, బడుగు బలహీన వర్గాలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం, జనత వస్త్రాలు, మండల పటేల్ పట్వారి వ్యవస్థలకు రద్దు చేయడం జరిగినదని అన్నారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్, డ్వాక్రా గ్రూపులు, సింగరేణిలో పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు కల్పించాడని తెలిపారు.

దాదాపు 30 నుండి 40 వేల వరకు కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని కొనియాడారు. నాడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు నందమూరి తారక రామారావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీని, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సాలిగామ సాగర్, బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య, కొత్తూరి నారాయణ, పుల్లూరు పోశం, మేకల రాజయ్య, మాదాసి గోపాల్, బొల్లు సత్యనారాయణ, గైని తిరుపతి, పెండ్యాల శ్రీనివాస్, వెంకటేశ్వర గౌడ్, రామగోని గంగాధర్ గౌడ్, దాగం పోశం, కొత్తపెళ్లి సత్యనారాయణ, తివారి, వి.రాములు, ఎస్. కె అజ్గర్ పాషా, ఎస్.కె నజీర్ పాషా, బోయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.