calender_icon.png 1 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం టిడిపి

29-03-2025 06:01:56 PM

టిడిపి జిల్లా నేత మొక్కిరాల జనార్ధన్ రావు..

కాటారం (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, కాటారం, ఘనపురం మండల కేంద్రాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేశారు. గణపురం(ము) మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు మొక్కిరాల జనార్ధన్ రావు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు జాతి ఆత్మగౌరవానికి, అభివృద్ధికి చిరునామా అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో 29 మార్చి 1982లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపై హైదరాబాదు నడిబొడ్డున ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ పాలనలో పటేల్ పట్వారి వ్యవస్థను తొలగించిందని, ఆ సంస్కరణల వల్లే తెలంగాణలో స్వేచ్ఛ స్వతంత్రాలు, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా సాధికారత లాంటివి లభించాయని అన్నారు. ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా, సామాజికంగా మహిళలను, యువతను ప్రోత్సహించారని. డ్వాక్రా గ్రూపులు, స్వయం సహయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా బలపరిచామని పెద్దపల్లి పార్లమెంటరీ టిడిపి పార్టీ ఇన్చార్జి అందే భాస్కరాచారి అన్నారు.

పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు, పెన్షన్ ఆదరణ ముందడుగు చేయూత, సంక్షేమ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా వచ్చినవే. రెండు రూపాయల కిలో బియ్యం, విధ్య, వైద్యంకు అధిక ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కమిటీ సభ్యులు మాచర్ల నగేష్, భూపాలపల్లి జిల్లా నాయకులు బయ్యన మహేందర్, బంటుపల్లి పాల్గుణ, కీర్తి శ్రీను, దండుగుల అశోక్, ఉప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.