టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు పోటు రంగారావు..
మణుగూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని టీడీపీ, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు పోటు రంగారావు అన్నారు. గురువారం మణుగూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పునర్ వైభవాన్ని తెలుగుదేశం పార్టీ చాటుతుందని అన్నారు. అనంతరం మణుగూరు ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను కమిటీ సభ్యులను ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసిరెడ్డి చలపతి, మాజీ సర్పంచ్ బచ్చల భారతి, నాయకులు నారాయణ దొర, మల్లిడి లోకేష్ నాగభూషణం పూర్ణ, హరి, యార్లగడ్డ రాజా, మల్లంపాటి రాజేశ్వరరావు, చావా రామారావు, బచ్చల సుమేష్, వాసు, పోడుతూరి రవీందర్, కమరున్నిసా బేగం, చావా శ్రీదేవి, రమ తదితరులు పాల్గొన్నారు.