calender_icon.png 23 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'కారు' కూతలు మానుకోవాలని టీడీపీ నేత హెచ్చరిక

22-02-2025 06:07:09 PM

కాటారం,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి పార్టీ(Bharat Rashtra Samithi Party) నాయకులు కారు కూతలు మానుకోవాలని పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అందే భాస్కరాచారి(TDP In-Charge Bhaskaracharya) హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్న కేసీఆర్(KCR) ఆగడాలను ప్రజలు గుర్తించి పక్కన పెట్టారనే విషయాన్ని మరిచిపోవద్దని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేత కేసిఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడం సరికాదని అన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో పదేళ్లు అధికారాన్ని అనుభవించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అధికార దాహం చల్లారలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు, వంకర బుద్ధులను ప్రజలు గమనించారని అందే భాస్కరాచారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దొరల అహంకారపూరితమైన వైఖరి వల్ల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, రాబోయే రోజుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ఘంటాపదంగా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని హితబోధ చేశారు.