calender_icon.png 1 April, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

29-03-2025 05:46:26 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. టిడిపి శ్రేణులు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్న నందమూరి తారక రామారావు నాయకత్వంలో 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 43 సంవత్సరంలు అయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎందరో ఎందరెందరో మహానుభావుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆణిముత్యాలు లాంటి నాయకులను తయారుచేసి, బడుగు బలహీన వర్గాల నుంచి దేశానికి సేవ చేసి దేశ నాయకులుగా ఎదిగేటందుకు ఊతమిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.

దేశవ్యాప్తంగా సర్వోన్నతమైనటువంటి పదవులను అలంకరించిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నాయకులు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్న సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఈరోజు పార్టీ పుట్టినరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్ర రవి పొందూరు నరసింహారావు సంకురాత్రి రవి శ్రీజ రవి కొల్లి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు నరిగ రమేష్ మెయిల్ టెక్ శ్రీనివాసరావు, రమేష్, శ్రీధర్, కోటేశ్వరరావు, బత్తిని దుర్గారావు గౌడ్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.