29-03-2025 05:56:19 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు పట్టణంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ ముందున్న పార్టీ జెండా వద్ద శనివారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేకు కోసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పార్టీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడారు. కూడు, గూడు, నీడ ప్రతి పేదవారికి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించడం జరిగిందన్నారు.
పార్టీ ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి కేవలం 9 నెలలోనే అధికారం చేపట్టి రైతులు రాజులుగా మారాలని మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని ఎన్నో సంస్కరణలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అలాగే రానున్న రోజుల్లో. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ సుకన్య. పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళ పట్టణ ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, భాగ్యలక్ష్మి., పారుపల్లి శ్రీను, జె స్వామి, చాట్లపల్లి రాజేష్, చోటు, సత్యనారాయణ, నల్లపు లింగయ్య, కళావతి, రమాదేవి, సరోజ, బానక్క, రాణి, అమృత, రాజేశ్వరి, సన, జ్యోతి లు పాల్గొన్నారు