calender_icon.png 7 February, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ పేలో కోత!

07-02-2025 12:46:09 AM

 ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఉద్యోగుల వేరియబుల్ పేలో కోత పెట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ చెల్లించాల్సిన వేరియబుల్ పేలో ఈ కోత విధించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీసు నిబంధనలు పాటించినప్పటికీ చెల్లించాల్సిన మొత్తం తగ్గించడం గమనార్హం.

ఇలా చేయడం ఇది వరుసగా రెండో త్రైమాసికమని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ మనీకంట్రోల్ ఓ కథనాన్ని ప్రచురించింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులు త్రైమాసిక వేరియబుల్ పే అలవెన్స్  కింద 20-40 శాతం మాత్రమే అందుకున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. కొందరికి పూర్తిగా చెల్లించలేదని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చెల్లించిన 70 శాతంతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. క్యూవీఏ కింద తనకు రూ.54 వేలు చొప్పున రావాల్సి ఉండగా.. గత త్రైమాసికంలో రూ.21వేలు మాత్రమే అందుకున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు.

ఈ సారి కేవలం రూ.16వేలు మాత్రమే చేతికొచ్చిందని చెప్పారు. 70 శాతం జూనియర్ ఉద్యోగులకు నూరు శాతం క్యూవీఏ చెల్లింపులు జరిగాయని, 30 శాతం మంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం పనితీరు ఆధారంగా వేరియబుల్ పే చేసినట్లు మరో ఉద్యోగి పేర్కొన్నారు.