సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు 2.4 శాతం జంప్ చేసి, రూ.4,460 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.3శాతం వరకూ లాభపడ్డాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు నష్టాలతో ముగిసాయి.వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ ఇండెక్స్ 1.96 శాతం పెరిగింది. టెక్నాలజీ ఇండెక్స్ 1.92 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.95 శాతం, బ్యాంకెక్స్ 0.68 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ ఇండెక్స్ 0.66 శాతం చొప్పున పెరిగాయి. సర్వీసెస్, రియల్టీ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి.