24-04-2025 10:14:01 PM
మణుగూరు (విజయక్రాంతి): గోదావరిఖని నందు జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు టిబిజికెయస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత(MLC Kavitha)ను టిబిజికెయస్ రాష్ట్ర అధ్యక్షులు, మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ సమక్షంలో మణుగూరు ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరింత బలోపేతం కావడం కోసం కల్వకుంట్ల కవిత ముందుండి నడవడం అభినందనీయమైన అంశం అని వారు తెలిపారు. యూనియన్ పై ఆమె ప్రత్యేక చొరవ ద్వారా టిబిజికెయస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో సింగరేణి నందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రానున్న రోజుల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, చీఫ్ వైస్ ప్రసిడెంట్ కూసాని వీర భద్రం, కొత్తగూడెం వైస్ ప్రసిడెంట్ గడప రాజయ్య, మణుగూరు సెంట్రల్ కమిటి సభ్యులు మురళి కృష్ణ, నాయకులు హరి ప్రసాద్ పాల్గొన్నారు.