16-04-2025 12:00:00 AM
జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం
మేడ్చల్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): టీబీ రోగులు మందులు, పౌష్టికాహారం సక్రమంగా తీసుకోవడం వల్ల వ్యాధి నుండి త్వరగా కోలుకోవచ్చని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. మంగళవారం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ సంస్థ నిక్షయ్ మిత్రా గా నమోదు చేసుకుని వారి సహకారంతో రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి ఉమా గౌరీ మాట్లాడుతూ ముందస్తుగా వ్యాధి నిర్ధారణ, సక్రమంగా మందులు వాడడం వల్ల క్షయ వ్యాధి నివారించవచ్చు అన్నారు. జిల్లాలో 6 టీబీ యూ నిట్లలో 750 రోగులకు రెండు నెలలు సరిపడా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సత్యవతి, అభిలాష్, శ్రీనివాస్, వాసు ప్రసాద్, భోగ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.