calender_icon.png 22 February, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 31 లోపు పన్నులు వసూలు చేయాలి

19-02-2025 07:54:22 PM

మున్సిపల్ ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్..

హుజురాబాద్ (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న పన్నులను మార్చి 31 లోపు 100% వసూలు చేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డ్రైనేజీలను సిసి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఆస్తి, నల్ల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసులు మోకాపై పరిశీలించారు. పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గొలుసుకట్టు కాలువలను పరిశీలించారు. వెంటనే గొలుసుకట్టు కాలువలను గుర్తించి మరమ్మతులు చేపించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తాహసిల్దార్ కనకయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశ్విని, రషీద్, శ్రీకాంత్, సుధీర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.