13-04-2025 12:56:22 AM
* ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
* అమెరికన్ టెక్ కంపెనీలకు భారీ ఊరట
వాషింగ్టన్, ఏప్రిల్ 12: కొద్ది రోజుల నుం చి సుంకాలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీపి కబురు చెప్పారు. ఇప్పటికే చైనా మిన హా మిగిలిన దేశాలకు సుంకాల నుంచి 90 రోజుల మినహాయింపునిచ్చిన ట్రంప్ ఇప్పు డు మరో కీలకనిర్ణయం వెలువరించారు.
ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్లు, మెమొరీ చిప్స్, హార్డ్ డ్రైవ్‌లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ డిస్‌ప్లేలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను మినహాయించారు. ఈ వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నా కానీ వీటికి సుంకాలు వర్తించవు. ప్రస్తుతం విధించిన ప్రతీకార సుంకాలు కాకుండా వేరే సుంకాలు వీటికి వర్తిస్తాయని కస్టమ్స్ విభాగం క్లారిటీనిచ్చింది. 20 రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లభించిం ది. ఈ మినహాయింపుతో అమెరికన్ టెక్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.